గుట్టు చప్పుడు కాకుండా గుట్కా ప్యాకెట్లను తరలిస్తోన్న ఓ వ్యక్తిని వరంగల్ రూరల్ జిల్లా పరకాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుని నుంచి రూ.1 లక్షా 12 వేల విలువైన గుట్కా ప్యాకెట్లు, కారుని స్వాధీనం చేసుకున్నారు.
రూ.లక్ష విలువైన గుట్కా పట్టివేత.. నిందితుడి అరెస్ట్ - వరంగల్ రూరల్ జిల్లా
నిషేధిత గుట్కాను అక్రమంగా తరలిస్తోన్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. భారీ గుట్కాతో పాటు కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా పరకాల సమీపంలో జరిగింది.
రూ. లక్ష విలువైన గుట్కా పట్టివేత.. నిందితుడి అరెస్ట్
నిందితుడు మల్లేశం.. గుట్కాను పరకాలకు చెందిన ఆకుల రాజు వద్ద తక్కువ ధరకు కొని.. చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కువ ధరకు విక్రయించేవాడని ఎస్సై మహేందర్ రెడ్డి తెలిపారు. నిషేధిత గుట్కాలు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: ఎస్సైనంటూ ఏపీ వ్యక్తిని మోసగించిన తెలంగాణ యువకుడు