వరంగల్‌లోని జాతీయ సాంకేతిక విద్యాసంస్థ నిట్‌లో స్మార్ట్ ఇండియా హాకథాన్ 2019 పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్ దిల్లీలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 45 నోడల్ కేంద్రాలలో 36 గంటల పాటు నిర్విరామంగా ఈ పోటీలు జరుగుతాయి.
ఎందుకు నిర్వహిస్తారు?
సమాజంలో తలెత్తిన వివిధ రకాల సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు కనుగొనేందుకు ఈ స్మార్ట్ ఇండియా పోటీలను నిర్వహిస్తారు. ప్రస్తుతం నిట్‌లో వ్యర్ధాల నిర్వహణ, స్మార్ట్ వాహనాలు, పుడ్ టెక్నాలజీ, రోబోటిక్స్, డ్రోన్లు, స్వచ్ఛమైన నీరు తదితర అంశాలపై పోటీలు జరుగుతున్నాయి.
ఎంతమంది పాల్గొంటున్నారు?
ప్రస్తుతం నిట్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రంలో 200 మంది విద్యార్ధులతో 30 జట్లు పలు సమస్యలకు సాంకేతిక పరిష్కారాలను కొనుగొనేందుకు పోటీ పడుతున్నారు. రేపు రాత్రి విజేతలను ప్రకటిస్తారు. గెలుపొందినవారికి 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు బహుమతులు అందిస్తారు.
ఇవీ చదవండి:పాలకుర్తిని అభివృద్ధి చేస్తా..
పురపోరుకు కసరత్తు