వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌కు సైన్ఫార్మా సీఈఓ కాల్వల భగీరథ రూ.లక్ష ఆర్థిక సాయం అందించారు. కరోనా వ్యాప్తి నివారణకు విధించిన లాక్‌డౌన్‌తో ఇబ్బంది పడుతున్నపేదల కోసం ఈ నగదు వినియోగించాలని ఎమ్మెల్యేను కోరారు.
కరోనాపై పోరుకు సైన్ఫార్మా రూ.లక్ష విరాళం - vardhannapeta mla aruri ramesh
కరోనా కష్టకాలంలో దాతలు తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. తోచిన సాయాన్ని అందిస్తూ పేదలను ఆదుకుంటున్నారు.
donation
దాతలు సహృదయంతో అందించిన ప్రతి రూపాయి పేదల ఆకలి తీర్చేందుకు వినియోగిస్తామని ఎమ్మెల్యే రమేష్ తెలిపారు. పేదలను ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.