వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేటలో బానోత్ తారాదేవి అనారోగ్యంతో బాధపడుతున్నారు. వాహనాలు అందుబాటులో లేకపోవడం వల్ల నడుచుకుంటూ ఆస్పత్రికి వెళ్తున్నారు. అంబేడ్కర్ సెంటర్లో ఆమెను గమనించిన ఎస్ఐ వంశీకృష్ణ.. తారాదేవి వద్దకు వెళ్లి విషయం తెలుసుకున్నారు. తన వాహనంలో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
మానవత్వం చాటిన ఎస్ఐ - వరంగల్ గ్రామీణ జిల్లా లాక్డౌన్ వార్తలు
అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళను ఆస్పత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట ఎస్ఐ. ఆపదలో ఉన్న వారిని ఆదుకున్న ఎస్ఐని పలువురు ప్రశంసించారు.
![మానవత్వం చాటిన ఎస్ఐ si help to illness women in warangal rural district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6904802-thumbnail-3x2-ca.jpg)
మానవత్వం చాటిన ఎస్ఐ