తెలంగాణ

telangana

ETV Bharat / state

'శివాజీ జయంతిని జాతీయ సెలవు దినంగా ప్రకటించాలి' - పరకాలలో శివాజీ జయంతి వేడుకలు

ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని పరకాలలో ఆరె కుల సంఘం సభ్యులు డిమాండ్​ చేశారు. బైక్​ ర్యాలీ నిర్వహించి.. నివాళులు అర్పించారు.

'శివాజీ జయంతిని జాతీయ సెలవు దినంగా ప్రకటించాలి'
'శివాజీ జయంతిని జాతీయ సెలవు దినంగా ప్రకటించాలి'

By

Published : Feb 19, 2020, 6:32 PM IST

Updated : Feb 19, 2020, 8:25 PM IST

వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఆరె కుల సంఘం ఆధ్వర్యంలో భారీ ద్విచక్రవాహన ర్యాలీ చేపట్టారు. పరకాలలోని వ్యవసాయ మార్కెట్ నుంచి ఆర్టీసీ డిపో వరకు ప్రదర్శన నిర్వహించారు. స్థానిక అమరధామంలో శివాజీ మహారాజ్​కు నివాళులు అర్పించారు.

'శివాజీ జయంతిని జాతీయ సెలవు దినంగా ప్రకటించాలి'

శివాజీ.. సామాన్య ప్రజానీకానికి యుద్ధ పాఠాలు నేర్పి.. హిందూ సామ్రాజ్యాన్ని నిర్మింపజేశారని అన్నారు. ఛత్రపతి శివాజీ జయంతిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి:ఛత్రపతి శివాజీకి ప్రధాని మోదీ నివాళి

Last Updated : Feb 19, 2020, 8:25 PM IST

ABOUT THE AUTHOR

...view details