ఓరుగల్లు వాసుల ఇలవేల్పు దైనం శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం అమ్మవారు కురుకుల్లా మాతగా, భేరుండా మాతగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలతో పాటు అభిషేకాలు చేశారు.
Shakambari Utsavalu: కురుకుల్లా మాతగా భద్రకాళి అమ్మవారి దర్శనం
భద్రకాళి మాత శాకాంబరి మహోత్సవాల్లో భాగంగా ఐదోరోజు అమ్మవారు కురుకుల్లా మాతగా, భేరుండా మాతగా భక్తులకు దర్శనమిచ్చారు. ప్రధానార్చకుడు శేషు ఆధ్వర్యంలో ఉదయం సుప్రభాత సేవ, శాకాంబరి నవరాత్రి పూజలు చేశారు.
భద్రకాళి అమ్మవారు
అనంతరం అమ్మవారిని విరోధిని రూపంలో అలంకరించారు. భద్రకాళిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. అమ్మవారి నామస్మరణలతో ఆలయం ప్రాంగణం మారుమోగింది.
ఇదీ చూడండి:REVANTH REDDY: పెద్దమ్మ తల్లి గుడిలో రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు