వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో ఆర్టీసీ డిపో వైపు వస్తున్న ఐదుగురు ఆర్టీసీ కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. మీరు విధుల్లో చేరడానికి అనుమతి లేదని చెప్పినా కార్మికులు అక్కడే ఉండటం వల్ల అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు.
50 అడుగుల దూరంలోనే బారికేడ్ల ఏర్పాటు - పరకాలలో 50 అడుగులు దూరంలోనే బారికేడ్ల ఏర్పాటు
వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో ఆర్టీసీ డిపో వద్ద అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. డిపో వైపు వస్తున్న వారందరినీ పోలీసులు తనిఖీ చేస్తున్నారు.
50 అడుగులు దూరంలోనే బారికేడ్ల ఏర్పాటు
పట్టణంలో ఆర్టీసీ డిపో వద్ద అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. డిపోకు 50 అడుగుల దూరంలోనే బారికేడ్లు ఏర్పాటు చేశారు. డిపో వైపు వస్తున్న పాదచారులు, ద్విచక్ర వాహనదారులతో సహా అన్ని వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకుంటున్నారు.
ఇవీ చూడండి: డిపోలకు వస్తున్న కార్మికులు... అడ్డుకుంటున్న పోలీసులు...