రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి. వరంగల్ గ్రామీణ జిల్లా పరకాలలో అక్రమంగా తరలిస్తున్న 9క్వింటాళ్ల రేషన్ బియ్యాన్నిపోలీసులు పట్టుకున్నారు.
రేషన్ బియ్యం పట్టివేత.. ఒకరి అరెస్టు - Seizure of illegally moving ration rice in warangal rural district
వరంగల్ గ్రామీణ జిల్లా పరకాలలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిని అదుపులో తీసుకుని విచారణ చేపట్టారు.
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత
పేద ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు అమ్ముకొనుటకు ఆటోలో అక్రమంగా తరలిస్తుండగా .. సమాచారం అందుకున్న పోలీసులు యస్ఐ ఎ.వెంకట కృష్ణ ఆధ్వర్యంలో రాయపర్తి వద్ద తనిఖీలు నిర్వహించారు. వరికోలు గ్రామానికి చెందిన పర్శ రవిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పి.మహేందర్ రెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి:రైతులకు, కేంద్రానికి కుదరని సయోధ్య- 8న మళ్లీ చర్చలు