వరంగల్ రూరల్ జిల్లా పరకాలకు చెందిన రాకేశ్ ఈనెల 14 పరకాల ఆర్టీసీ డిపో దగ్గరున్న మద్యం షాపులో బీరు కొనుగోలు చేశాడు. బయటకు తీసుకెళ్లి తాగుదామని తెరిచి చూసే సరికి అందులో తేలు ఉండటం చూసి అవాక్కయ్యాడు.
బీరు సీసాలో తేలు.. తాగితే అంతే సంగతులు - parakala
మండు వేసవిలో చల్లని బీరు తాగితే ఆ మజానే వేరంటూ వైను షాపుల ముందు క్యూ కడతుంటారు మందు ప్రియులు. కానీ వరంగల్ జిల్లా పరకాలలో జరిగిన ఘటన తెలిస్తే ఉలిక్కి పడటం ఖాయం. వెచ్చని సాయంత్రం చల్లగా తాగుదామని బీరు సీసా కొన్నాడో యువకుడు. తాగడానికి తెరవగా అందులో తేలును చూసి అవాక్కయ్యాడు. కిక్కు మాట దేవుడెరుగు.. ప్రాణం పోయేదంటూ లబోదిబోమంటున్నాడు.
![బీరు సీసాలో తేలు.. తాగితే అంతే సంగతులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-3005601-thumbnail-3x2-beerbottle.jpg)
బీరు బాటిల్
షాపు యజమాని దగ్గరకు తీసుకెళ్లి విషయం చెబితే మొదట ఇక్కడ కొనలేదని వాదించారు. గట్టిగా ప్రశ్నిస్తే ఇక్కడ కొన్నంత మాత్రాన తామేమీ చేయలేమని సమాధానమిచ్చారు. తనకు న్యాయం చేయమంటే ఇది అధికార పార్టీ ఎమ్మెల్యే షాపు అంటూ దౌర్జన్యానికి దిగాడు.
కిక్కుకోసం బీరు కొంటే చిక్కొచ్చిపడిందంటూ బాధితుడు వాపోయాడు. ఇలాంటి వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలంటూ కొనుగోలు దారులు డిమాండ్ చేస్తున్నారు. ఇకనైన మద్యం ప్రియులు గుటక వేసే ముందు ఓ సారి చూసి తాగండి.
బీరు బాటిల్లో తేలు.. తాగితే పోయేవి ప్రాణాలు..
ఇదీ చదవండి: పెళ్లి కోసం ఒత్తిడి చేసిందని చంపేశాడు
Last Updated : Apr 15, 2019, 7:13 PM IST