ములుగులోని లిటిల్ ఫ్లవర్ ప్రైవేటు ఉన్నత పాఠశాలలో మూడురోజుల పాటు జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ఉత్సాహంగా ముగిసింది. సైన్స్ అనేది మనిషి జీవనంతో ముడిపడి ఉందని, ఎన్ని ప్రయోగాలు చేసినా ప్రకృతికి విఘాతం కలుగకుండా చూసుకోవాలని ప్రదర్శనను తిలకించిన జడ్పీ వైస్ ఛైర్మన్ బడిన నాగజ్యోతి సూచించారు. కొత్త ఆలోచన కొత్త ఆవిష్కరణకు మూలాలుగా ఉండాలన్నారు.
ఆలోచింపజేసిన ఆవిష్కరణలు
జిల్లాలోని 9 మండలాల నుంచి 209 మంది విద్యార్థులు తమ ఆవిష్కరణలు ప్రదర్శించారు. నాలుగు వేల మంది విద్యార్థులు పాల్గొని కొత్త ఆలోచనలను ఆవిష్కరించారు.
వసంత విద్యార్థిని పస్రా
ఎగ్జిబిషన్లో స్టాళ్లను నిపుణులు పరిశీలించారు. ఉత్తమమైన ప్రదర్శనలు చేసిన 18 మందికి ప్రశంసాపత్రాలు అందజేసినట్లు డీఈఓ రాజీవ్ పేర్కొన్నారు.
వెంకట్ టీచర్
వైజ్ఞానిక ప్రదర్శనకు పిల్లలు, తల్లిదండ్రులు కూడా హాజరై పర్యవేక్షించారు. చేపల ఎరువుతో 100 శాతం ఆర్గానిక్ ఫుడ్ తయారీ, వర్షాభావ పరిస్థితుల్లో నీటి పొదుపు అంశాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
వైజ్ఞానిక ప్రదర్శనలు... సృజనాత్మకతకు వేదికలు - latest news of science exhibitions in warangal
ప్రతి విద్యార్థికి ఏదో ఒక కొత్త ఆలోచన ఉంటుంది... వారిని యువ శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దుతూ సమాజ హితం కోసం కృషి చేయేందుకు ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శన అందరిని ఆకట్టుకుంటుంది. సుస్థిర వ్యవసాయం, పరిశుభ్రత, ఆరోగ్యం, వనరుల నిర్వహణపై విద్యార్థులు తమ ఆవిష్కరణలను ప్రదర్శించారు.
వైజ్ఞానిక ప్రదర్శనలు... సృజనాత్మకతకు వేదికలు
ఈ ఎగ్జిబిషన్లో ఉత్తమ ప్రదర్శన చేసిన 18 మంది... డిసెంబర్ మొదటి వారంలో జరిగే రాష్ట్ర స్థాయి ప్రదర్శనలో పాల్గొంటారు.
ఇదీ చూడండి: హింసకు సంకెళ్లేద్దాం... 'ఆమె'ను స్వేచ్ఛగా ఎగరనిద్దాం!