MLA Rajaiah Vs Sarpanch Navya Issue Update :ఎమ్మెల్యే రాజయ్య, సర్పంచ్ నవ్య వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. నిన్న జానకీపురం గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజయ్య తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఒప్పందం పేరుతో తనను వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ ధర్మసాగర్ పోలీస్ స్టేషన్లో స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్యపై జానకీపురం సర్పంచ్ కురుసపల్లి నవ్య ఫిర్యాదు చేశారు. రాజయ్యతో పాటు ఆయన అనుచరుడు శ్రీనివాస్, ఎంపీపీ కవిత, తన భర్త ప్రవీణ్‌పైనా చర్యలు తీసుకోవాలంటూ ఆమె ఫిర్యాదు చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Sarpanch Navya Complaint against MLA Rajaiah : స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య తనను లైంగికంగా వేధిస్తున్నారని గతంలో నవ్య ఆరోపణలుచేసిన విషయం తెలిసిందే. అయితే.. నవ్య, రాజయ్య సామరస్యంగా సమస్యను పరిష్కరించుకున్నారు. అదే విషయంలో గ్రామ అభివృద్ధి కోసం రూ.25లక్షలు తన నిధుల నుంచి ఇస్తానని ఎమ్మెల్యే రాజయ్య హామీ ఇచ్చారు. ఈ క్రమంలో నిధులు ఇవ్వకపోగా.. తాను డబ్బులు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోందని నవ్య.. ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ఇదే విషయంపై నవ్య భర్త ప్రవీణ్.. ఎమ్మెల్యేను నిలదీశారు. దీంతో రాజయ్య గ్రామాభివృద్ధికి రూ.25లక్షలు ఇస్తామని, రూ.20లక్షలు వ్యక్తిగతంగా ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రవీణ్‌కు రాజయ్య రూ.7లక్షలు ఇచ్చారు. మిగతా నగదు ఇవ్వాలని అడిగితే ఒప్పంద పత్రంపై సంతకం చేయాలని ఒత్తిడి తెచ్చారు. గతంలో చేసిన లైంగిక ఆరోపణలు రాజకీయ కోణంలో చేసినవని చెప్పాలని తెలిపారు. దీంతో పాటు రూ.20లక్షలు మళ్లీ అడిగినప్పుడు తిరిగివ్వాలని కోరారు.