వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలంలో ఓ వృద్ధుడు.. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చూపించుకున్నాడు. ఆయనను పరీక్షించిన వైద్యులు.. కోరనా ఉందని తెలిపి హోం ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు. మంగళవారం ఆ వృద్ధుడు మరణించారు.
కుటుంబం కాదంది.. అందుకే సర్పంచే అంత్యక్రియలు చేశారు! - రాయపర్తిలో కరోనా మృతికి అంత్యక్రియలు వార్తలు
వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలంలో ఓ వ్యక్తికి కరోనా సోకి మరణించగా.. కడుపున పుట్టినవారు మాకు సంబంధం లేదన్నారు. మానవత్వం కలిగిన ఓ సర్పంచ్.. అతనికి అన్నీ తానై దహన సంస్కారాలు పూర్తిచేసి గ్రామస్థుల మన్ననలు పొందారు.
కుటుంబం కాదంది.. అందుకే సర్పంచే అంత్యక్రియలు చేశారు!
కరోనా భయంతో అయినవాళ్లు అతన్ని పట్టించుకోలేదు. ఆఖరు చూపు చూడడానికి కూడా రాకుండా అనాథలా వదిలేశారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ సరసయ్య మానవతా దృక్పథంతో ఆ వృద్ధునికి అన్నీ తానయ్యాడు. గ్రామ పంచాయతీ సిబ్బంది సహకారంతో ట్రాక్టర్లో ఊరు చివరకు తీసుకెళ్లి అంతిమ సంస్కరణలు పూర్తి చేశారు. అది చూసిన స్థానికులు సర్పంచ్‌ను అభినందించారు.