తెలంగాణ

telangana

ETV Bharat / state

నర్సంపేట మండలం గురిజాలలో కొవిడ్​ కట్టడి చర్యలు - గ్రామంలో శానిటైజేషన్​ చేయించిన గురిజాల సర్పంచ్​

పల్లెల్లో కొవిడ్ మహమ్మారి విస్తరిస్తుంది. పలు గ్రామాల్లో వైరస్ కట్టడికి స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట మండలం గురిజాల గ్రామంలో హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేయించారు.

news
వరంగల్​ వార్తలు

By

Published : May 20, 2021, 2:05 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లాలో కొవిడ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పలు గ్రామాల్లో వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి సర్పంచ్​లు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. నర్సంపేట మండలం గురిజాల గ్రామంలో వైరస్ కట్టడికి సర్పంచ్ గొడిశాల మమత సదానందం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేయించారు.

గ్రామాల్లో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని... ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అత్యవసరమైతే తప్ప లాక్​డౌన్​ సమయంలో ఎవ్వరూ బయటకు రావొద్దని సూచించారు.

ఇదీ చూడండి:బ్లాక్‌ ఫంగస్‌ ఔషధాలు కావాలంటే మెయిల్ చేయండి: కేటీఆర్‌

ABOUT THE AUTHOR

...view details