తెలంగాణ

telangana

ETV Bharat / state

సమీకృత వ్యవసాయసాగులో విజయ 'జ్యోతి' - abboju jyothi

ఆమె ఆత్మ విశ్వాసం ముందు పేదరికం ఓడింది. ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడటం కంటే వాటిన ఎదుర్కొని విజయం సాధించాలనుకుంది. కుటుంబ పోషణ భారంగా మారిన సమయంలో భర్త సహకారంతో సమీకృత సాగు చేసి ఆర్థికంగా నిలదొక్కుకుని... దిల్లీలో జరిగే కిసాన్ మేళాలో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకుని పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది ఆ మహిళ.

ఆత్మ విశ్వాసం ముందు పేదరికం ఓడింది

By

Published : Apr 30, 2019, 2:31 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలంలోని పెరకవేడు గ్రామానికి చెందిన అబ్బోజు జ్యోతికి ఇద్దరు పిల్లలు, భర్త సుతారి పని చేసేవాడు. వారికున్న రెండెకరాల భూమిలో వ్యవసాయం చేసినా ఆశించిన స్థాయిలో పంటలు పండక... పెట్టుబడులు పెట్టలేక నష్టాలనే మూట గట్టుకున్నారు. భర్త కష్టాన్ని చూసి తానుకూడా ఏదైనా చేసి తోడవ్వాలనుకుంది. చదివింది డిగ్రీ అయినా ఏదైనా స్కూల్​లో చెపితే వచ్చే జీతం తమ భారాన్ని తీర్చలేవు అనుకున్నది.

ఆత్మ విశ్వాసం ముందు పేదరికం ఓడింది
అమ్మమ్మే స్ఫూర్తిగా... అమ్మమ్మ ఇంట్లో ఉంటూ గెదేలు పెంచి పాలు అమ్మి సంపాదించడం గుర్తుకు వచ్చి గేదెలు పెంచాలని నిశ్చయించుకుని భర్త అనుమతి తీసుకుంది. పాలను విజయ డెయిరీకి అమ్మి ఆర్థికంగా కొంచెం నిలదొక్కున్నారు. అనంతరం మహిళా సంఘాలలో చేరి అప్పు చేసి మరికొన్ని కొనుగోలు పాడి సాగించారు.సమీకృత సాగుకు నాంది... కృషి విజ్ఞాన కేంద్రంలో జరిగే తరగతులకు భర్తతో కలిసి వెళ్లి వారి సలహాల మేరకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో సేద్యపు కుంటను తవ్వించుకుని మూడేళ్ల నుంచి చేపల పెంపకం చేపట్టారు. ఏడాది కిందట కోళ్ల ఫారం ఏర్పాటు చేసుకున్నారు. ఒకప్పుడు తినడానికి కూడా ఇబ్బంది పడిన వీరు నెలకు 60 నుంచి 70 వేలు సంపాదిస్తున్నామని తెలిపారు. చేపలు ద్వారా 8 నెలలకోసారి ఆదాయం వస్తుందని సుమారు లక్ష వరకు వస్తాయని వెల్లడించారు. దిల్లీ వేడుకలో పాల్గొనే అవకాశం... కృషి విజ్ఞాన కేంద్రంలో పాల్గొని సమీకృత సాగు చేసి లాభాలు ఆర్జిస్తున్న జ్యోతిని గుర్తించి దిల్లీలో జరిగే కిసాన్ మేళాలో పాల్గొనే అవకాశం కల్పించారు అధికారులు. ఆరేళ్ళ కిందటి వరకు ఆర్ధిక సమస్యలతో ఇబ్బందులకు గురైన ఆమె పట్టుదలతో ప్రయత్నించి పేదరికాన్ని జయించింది. భర్త అండతో సమీకృత సాగులో విజయ శిఖరాలను చేరిన ఆ వనిత ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details