తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి : సత్యవతి రాఠోడ్​ - సైనిక పాఠశాల భవనం ప్రారంభం

రాష్ట్రప్రభుత్వం గిరిజనుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని మంత్రి సత్యవతి రాఠోడ్​ తెలిపారు. వరంగల్​ గ్రామీణ జిల్లా ఖానాపురం మండలం అశోక్​నగర్​లో​ నిర్మించిన గిరిజన సంక్షేమ గురుకుల సైనిక పాఠశాల భవనాన్ని మంత్రి ప్రారంభించారు.

sainik school building opening by minister satyavathi rathod in warangal rural dist
విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి : సత్యవతి రాఠోడ్​

By

Published : Dec 17, 2020, 7:58 PM IST

విద్యార్థులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మంత్రి సత్యవతి రాథోడ్ ఆకాంక్షించారు. వరంగల్ గ్రామీణ జిల్లా ఖానాపురం మండలం అశోకనగర్​లో నిర్మించిన గిరిజన సంక్షేమ గురుకుల సైనిక పాఠశాల నూతన భవన సముదాయాన్ని ఆమె ప్రారంభించారు. రాష్ట్రప్రభుత్వం గిరిజన బిడ్డలకోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు.

పట్టణంలో బాలికలకు డిగ్రీ కళాశాల, గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మాలోతు కవిత, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.

ఇదీ చూడండి:ఆరేళ్లలో టీఎస్‌పీఎస్సీపై ఒక్క ఆరోపణ కూడా రాలేదు: సీఎస్

ABOUT THE AUTHOR

...view details