వరంగల్ ప్రజావాణికి పోటెత్తిన జనం - వరంగల్ ప్రజావాణికి పోటెత్తిన జనం
వరంగల్ జిల్లాలో చేపట్టిన ప్రజావాణి కార్యక్రమానికి జనం భారీగా తరలివచ్చారు. తమ సమస్యలను పరిష్కరించుకోవటం కోసం కలెక్టరేట్‌కు బారులు తీరారు.
వరంగల్ ప్రజావాణికి పోటెత్తిన జనం
వరంగల్ అర్బన్, గ్రామీణ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి జనం పోటెత్తారు. తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు వివిధ గ్రామాల నుంచి ప్రజలు బారులు తీరారు. జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. ఎక్కువగా భూ సమస్యలు, ఫించన్లు, సదరన్ ధ్రువపత్రాల బాధితులు తరలివచ్చారు. ఎన్నిసార్లు తిరిగినా సమస్య పరిష్కారం అవ్వకపోవడంపై కొందరు అసహనం వ్యక్తం చేశారు.