వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో ఆర్టీసీ కార్మికులు చెప్పలేని ఆనందంతో విధులకు హాజరయ్యారు. మెకానిక్లు మాత్రం నిన్న రాత్రి నుంచే విధులకు వచ్చారు. 90 బస్సులు ఉన్న పరకాల ఆర్టీసీ డిపోలో 60 బస్సులు నడపడానికి సిద్ధంగా ఉన్నాయని.. రానున్న పది రోజుల్లో మిగిలిన 30 బస్సులు సిద్ధం చేస్తామని కార్మికులు తెలిపారు.
పరకాలలో విధులకు హాజరైన ఆర్టీసీ కార్మికులు - వరంగల్ రూరల్ జిల్లా పరకాల ఆర్టీసీ కార్మికులు
నిన్నటి సీఎం కేసిఆర్ ప్రకటనతో జవసత్వాలు నింపుకొని ఆర్టీసీ డిపోల ముందు కార్మికులు ఉదయం ఆరు గంటలకే ప్రత్యక్షమయ్యారు. పరకాలలో ముఖ్యమంత్రికి కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు.
పరకాలలో విధులకు హాజరైన ఆర్టీసీ కార్మికులు