వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరులో గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ రవీందర్ మృతి చెందాడు. ఆయన మృతదేహానికి నివాళి అర్పించేందుకు వచ్చిన పరకాల ఎమ్మెల్యే చల్లాధర్మారెడ్డిని కార్మికులు అడ్డుకున్నారు. గో బ్యాక్ ధర్మారెడ్డి అంటూ నినాదాలు చేశారు.
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి చేదు అనుభవం
పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. గుండెపోటుతో మృతి చెందిన ఆర్టీసీ కండక్టర్ రవీందర్ మృతదేహానికి నివాళి అర్పించేందుకు వచ్చిన ఎమ్మెల్యేను కార్మికులు అడ్డుకున్నారు.
ఎమ్మెల్యే ధర్మారెడ్డిని అడ్డుకున్న ఆర్టీసీ కార్మికులు
మృతి చెందిన కుటుంబానికి ఆర్థిక సాయం చేసి కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. నివాళి అర్పించిన వెంటనే... ధర్మారెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు.