ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మృతితో వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపో ముందు కార్మికులు ఉదయం నుంచి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. డిపో పరిధిలో డ్రైవర్గా పనిచేస్తోన్న బత్తిని రవి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం - వరంగల్ రూరల్ జిల్లా
వరంగల్ రూరల్ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. నర్సంపేటలో డ్రైవర్గా పనిచేస్తోన్న బత్తిని రవి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం