తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎడ్ల బండిని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు - rtc bus accident in warangal

వరంగల్​ రూరల్​ జిల్లా దామెర మండలం ఊరుకొండ వద్ద ఆర్టీసీ బస్సు ఎడ్ల బండిని ఢీ కొట్టింది. తాత్కాలిక డ్రైవర్​ బస్సును అక్కడే వదిలేసి పారిపోయాడు.

ఎడ్ల బండిని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు

By

Published : Nov 5, 2019, 12:58 PM IST

ఆర్టీసీ బస్సు ఎడ్లబండిని ఢీ కొట్టిన ఘటన వరంగల్​ రూరల్​ జిల్లా దామెర మండలం ఊరుకొండ వద్ద చోటుచేసుకుంది. వరంగల్​ డిపో-2కు చెందిన బస్సు హన్మకొండ నుంచి ఏటూరునాగారం వెళ్తున్న క్రమంలో ఊరుకొండ వద్ద ఎడ్లబండిని ఢీ కొట్టింది.

ఎడ్ల బండిని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు

అందులోని ముగ్గురు తీవ్రంగా గాయపడగా.. వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ఒక ఎద్దు తీవ్రంగా గాయపడింది. బస్సులో ప్రయాణిస్తున్న వారు సురక్షితంగా బయటపడ్డారు. తాత్కాలిక డ్రైవర్​ బస్సును అక్కడే వదిలేసి పారిపోయాడు.

సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details