వరంగల్ గ్రామీణజిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలోని నిరుపేదలకు ఆర్ఎస్ఎస్ సేవా భారతి విశిష్ట సేవలు అందిస్తుంది. స్వచ్ఛంద కార్యక్రమాలతోపాటు దాతల సహకారంతో లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇవే కాకుండా గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రతి రోజు అల్పాహారం, భోజనం అందిస్తున్నారు.
నిరుపేదలకు అండగా ఆర్ఎస్ఎస్ సేవా భారతి - RSS Seva bharati distributes Essential goods for poor peoples
ఉన్నవారు లేని వారికి చేయూతనిచ్చేందుకు ఈ ఆపత్కాలమే సరైన సమయమని ఆర్ఎస్ఎస్ సేవా భారతి సభ్యులు పేర్కొన్నారు. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
నిరుపేదలకు అండగా ఆర్ఎస్ఎస్ సేవా భారతి
మంగళవారం జరిగిన సరుకుల వితరణ కార్యక్రమాన్నికి వర్ధన్నపేట సీఐ విశ్వేశ్వర్, ఎస్సై వంశీ కృష్ణ హాజరై పంపిణీ చేశారు. భౌతిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రపై అవగాహన కల్పించారు. నిరుపేదలకు అండగా నిలుస్తున్న సేవా భారతి నిర్వాహకులను అభినందించారు.