వరంగల్ గ్రామీణ జిల్లాలో ఓ రౌడీ షీటర్‌కు ఆరు నెలల జైలు శిక్ష పడింది. జిల్లా పరిధిలో పలు సందర్భాల్లో బైండోవర్ నియమాలను ఉల్లంఘించిన వ్యక్తికి జైలు శిక్ష విధిస్తూ... వర్ధన్నపేట ఎగ్జిక్యుటివ్ మేజిస్ట్రేట్ ఉత్తర్వులను జారీ చేశారు. వర్ధన్నపేట మండలం బొక్కలగుడెం గ్రామానికి చెందిన రౌడీషీటర్ పంజా వెంకన్న గతంలో రెండు కేసులలో నిందితుడిగా ఉన్నాడు.
రౌడీషీటర్‌కు ఆరు నెలల జైలు శిక్ష - Telangana news
బైండోవర్ నియమాలను దిక్కరించిన ఓ రౌడీషీటర్‌కు వర్ధన్నపేట మేజిస్ట్రేట్ ఆరు నెలల జైలు శిక్ష విధించారు. వరంగల్ గ్రామీణ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
బైండోవర్ దిక్కరణ... రౌడీషీటర్‌కు 6 నెలలు జైలు శిక్ష
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని రౌడీ షీటర్ వెంకన్నని మరో కేసులో ఎగ్జిక్యుటివ్ మేజిస్ట్రేట్ ముందు బైండోవర్ కావాలని ఆదేశాలు జారీ చేశారు. రాయపర్తి మండలానికి చెందిన గుగులోతు వనిత హత్యనేరంలో నిందితుడిగా ఉండి బైండోవర్ నియమాలని ఉల్లంఘించిన నేపథ్యంలో పంజా వెంకన్నకు ఎగ్జిక్యుటివ్ మేజిస్ట్రేట్ భాస్కర్... ఆరు నెలల జైలుశిక్ష విధించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.