వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహేశ్వరంలో నివాసముంటున్న బలభద్ర సారంగం... నర్సంపేటలో బీరువాల వ్యాపారం చేస్తున్నాడు. రోజూలానే దుకాణానికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు సారంగం. బండారి రైస్‌మిల్ వద్దకు చేరుకోగానే... ప్రమాదవశాత్తు ముందు వెళ్తున్న లారీ వెనుక చక్రాల కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సారంగం... అక్కడికక్కడే మృతి చెందాడు.
లారీ వెనుక చక్రాల కింద పడి వ్యక్తి దుర్మరణం - NARSAM PET ROAD ACCIDENT
రోజూలాగే తన వ్యాపారానికి వెళ్తున్న ఆ వ్యక్తిని లారీ రూపంలో మృత్యువు కబళించింది. ప్రమాదం ఎలా జరిగిందో తెలిసేలోపే రహదారిపై ఆ వ్యక్తి విగతజీవిగా మారిపోయాడు. వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట వద్ద లారీ కింద పడి ఓ వక్తి అక్కడికక్కడే మరణించాడు.
ROAD ACCIDENT ONE DIED IN NARSAMPET