వరంగల్ గ్రామీణ జిల్లాలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. జిల్లాలోని తిరుమలాయపల్లి గ్రామ శివారులో పోలీసు వాహనం, ద్విచక్ర వాహనం ఢీకొని ముగ్గురు మృతి చెందారు. మృతుల కుటుంబసభ్యులు, బంధువులు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ వర్ధన్నపేట మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు.
ఉద్రికత్తలకు దారితీసిన రోడ్డు ప్రమాదం - వర్ధన్నపేటలో ఉద్రికత్తలకు దారితీసిన రోడ్డు ప్రమాదం
వరంగల్ గ్రామీణ జిల్లాలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. మృతుల కుటుంబసభ్యులు, బంధువులు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ వర్ధన్నపేట మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు.
ఉద్రికత్తలకు దారితీసిన రోడ్డు ప్రమాదం
మృతుల బంధువులకు పోలీసులకు తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో వారిని అదుపు చేసేందుకు పోలీసులు శతవిధాల ప్రయత్నించిన లాభం లేకుండా పోయింది. శిక్షణలో ఉన్న మహిళా కానిస్టేబుల్స్ అధిక సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులను అదుపు చేశారు. రాస్తారోకో వలన దాదాపు మూడు కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పోలీసులు ఆందోళనకారులను శాంతింపజేయడం వల్ల సమస్య సద్దుమణిగింది.
ఇవీ చూడండి:దానం చేస్తే 25లక్షలు అన్నారు.. అందినకాడికి దోచేశారు!
TAGGED:
today Road accident updates