తెలంగాణ

telangana

ETV Bharat / state

పరకాలలో రోడ్డు ప్రమాదం... 20మందికి తీవ్ర గాయాలు - పరకాలలో రోడ్డు ప్రమాదం... 20మందికి తీవ్ర గాయాలు

వరంగల్ గ్రామీణ జిల్లా పరకాలలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాళేశ్వరంలో అస్థికలు కలిపేందుకు బయలుదేరిన వాహనం ఆగి ఉన్న లారీని బలంగా ఢీ కొట్టింది. సుమారు 20 మందికి గాయాలయ్యాయి.

పరకాలలో ఘోర రోడ్డు ప్రమాదం...
పరకాలలో ఘోర రోడ్డు ప్రమాదం...

By

Published : Mar 16, 2020, 10:01 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లా పరకాలలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దామెర మండలం సింగరాజుపల్లికి చెందిన ఒడ్డెపల్లి పెద్దమల్లయ్య అస్థికలు కాళేశ్వరంలో కలిపి స్వస్థలానికి బయలుదేరగా మార్గం మధ్యలో ప్రమాదం జరిగింది. డీసీఎం వాహనం ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. అందులోని దాదాపు 20 మంది గాయాలపాలయ్యారు. తీవ్రంగా గాయపడ్డ ఒడ్డెపల్లి నాగలక్ష్మిని వరంగల్​ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

మిగిలిన వారిలో కొందరికి తలకు, కాళ్ళకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను పరకాలలోని సివిల్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో మరో 15 మంది స్వల్పంగా గాయపడ్డారు.

పరకాలలో ఘోర రోడ్డు ప్రమాదం...

ఇవీ చూడండి : ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఓమ్ని... ముగ్గురు మృతి

ABOUT THE AUTHOR

...view details