Road Accident in Hanamkonda : హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుళ్ల శివారులో జెర్రీ పోతుల వాగు సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డుప్రమాదం జరిగింది. ములుగు నుంచి హనుమకొండకు వెళ్తున్న ఆర్టీసీ బస్సును(TSRTC Bus) ఎదురుగా వస్తున్నఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో, ఆయిల్ ట్యాంకర్ పక్కనే ఉన్న చిన్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్లకు తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్కు తరలించారు.
Diesel Tanker Collided RTC Bus :బస్సులో ప్రయాణిస్తున్న పదిమంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి(MGM Hospital) బాధితులను తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 90 మందికి పైగా ప్రయాణిస్తున్నట్లు ఆర్టీసీ కండక్టర్ సునీత తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణహాని జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
బైకును ఢీకొన్న టిప్పర్ లారీ - మంటలు చెలరేగి తండ్రీకుమారులు సజీవదహనం
ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ తప్పిదం వల్లే, ఈ ప్రమాదం జరిగిందని బస్సులోని ప్రయాణికులు ఆరోపించారు. ఆత్మకూరు సీఐ రవిరాజు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు యాక్సిడెంట్ కారణంగా ట్రాఫిక్ స్తంభించడంతో మేడారం వెళ్లే భక్తులు గంటన్నరపాటు ఇబ్బందులు పడ్డారు.