వరంగల్ గ్రామీణ జిల్లాలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ హరిత.. కలెక్టరేట్లో జాతీయ జెండాను ఎగురవేశారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
అనతి కాలంలోనే అభివృద్ధి బాట: కలెక్టర్ హరిత
వరంగల్ గ్రామీణ జిల్లాలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టరేట్లో కలెక్టర్ హరిత జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
వరంగల్ రూరల్, గణతంత్ర దినోత్సవ వేడుకలు
నాలుగేళ్ల స్వల్ప కాలంలోనే అందరి సహకారంతో జిల్లా అభివృద్ధి బాటన పరుగులు తీస్తోందని కలెక్టర్ అన్నారు. కరోనా మహమ్మారి నిర్మూలనలో అన్ని వర్గాలు ఇస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలియజేశారు.