తెలంగాణ

telangana

ETV Bharat / state

'రేపటి ఎన్నికల ప్రచార సభను విజయవంతం చేయాలి' - Kadiyam_CM_sabha

రాష్ట్రంలో 16 ఎంపీ సీట్లను తెరాసకు కట్టబెడితే... కేంద్రం నుంచి నిధులు వరదలా వస్తాయన్నారు మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి. వరంగల్​లో రేపు జరిగే ఎన్నికల ప్రచార సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

'రేపటి ఎన్నికల ప్రచార సభను విజయవంతం చేయాలి'

By

Published : Apr 1, 2019, 11:29 AM IST

తెలంగాణకు నిధులు, ప్రాజెక్టుల మంజూరులో కేంద్రం మెుదటి నుంచి అలసత్వం ప్రదర్శిస్తోందని మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆరోపించారు. ఈసారి కేంద్రంలో హంగ్ ఏర్పడే అవకాశం ఉందని.. తెరాసకు 16 సీట్లు కేటాయిస్తే.. అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయన్నారు. వరంగల్​లో రేపటి ముఖ్యమంత్రి ప్రచార సభకు 32 ఎకరాల్లో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 1000 ఆర్టీసీ బస్సులతో పాటు వేల సంఖ్యలో ఇతర వాహనాల ద్వారా దాదాపుగా 2.5 లక్షల మందిని తరలించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు కడియం తెలిపారు.

'రేపటి ఎన్నికల ప్రచార సభను విజయవంతం చేయాలి'

ABOUT THE AUTHOR

...view details