ప్రేమోన్మాది చేతిలో పెట్రోల్ దాడికి బలైన రవళి మృతదేహాన్ని వరంగల్ జిల్లాలోని రామచంద్రాపురంనకు చేర్చారు. రవళి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కూతురి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
గత నెల 27న సాయి అన్వేష్ అనే సహచర విద్యార్థి చేతిలో రవళి పెట్రోల్ దాడికి గురైంది. వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడి నిన్న రాత్రి సికింద్రాబాద్‌లోని యశోదలో కన్నుమూసింది. ఈ రోజు ఉదయం గాంధీ ఆసుపత్రిలో శవపరీక్షలు పూర్తి చేసి మృతదేహాన్ని స్వస్థలానికి పంపించారు.