తెలంగాణ

telangana

ETV Bharat / state

రవళి అంత్యక్రియలు - petrol attack

ప్రేమోన్మాది దాడికి గురై ఆరు రోజులు మృత్యువుతో పోరాడి ఓడిపోయింది రవళి. గ్రామస్థులు, కుటుంబసభ్యుల అశ్రునాయనాల మధ్య అంత్యక్రియలు వరంగల్‌ జిల్లా రామచంద్రాపురంలో ముగిశాయి. రాత్రి యశోదా నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించి శవపరీక్ష నిర్వహించగా ఉదయం బాధిత కుటుంబాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు పరామర్శించారు.

రవళి అంత్యక్రియలు

By

Published : Mar 5, 2019, 7:54 PM IST

రవళి అంత్యక్రియలు
ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి మృతి చెందిన రవళి అంత్యక్రియలు ముగిశాయి. గ్రామస్థులంతా ఆమె అంతిమ యాత్రలో పాల్గొన్నారు. 'అమ్మా వెళ్లిపోతున్నావా'... అంటూకుటుంబసభ్యుల రోదనలు గ్రామంలో మిన్నంటాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ గ్రామస్థులు డిమాండ్ చేశారు.

గత నెల 27న ప్రేమోన్మాది సాయి అన్వేష్చేతిలో పెట్రోల్‌ దాడికి గురైన యువతి.. ఆరు రోజులుగా మృత్యువుతో పోరాడి... గత రాత్రి యశోదా ఆసుపత్రిలో తనువు చాలించింది. ఉదయం గాంధీ ఆసుపత్రిలో శవపరీక్షలు పూర్తి చేసి... ఆమె స్వగ్రామమైన వరంగల్ జిల్లా రామచంద్రాపురానికి మృతదేహాన్ని తరలించారు.

కుటుంబాన్ని ఆదుకుంటాం:

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుఆసుపత్రికి వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. రాష్ట్రంలో మరే ఆడపిల్లకుఇలాంటి అన్యాయం జరగకుండా నిందితుడి​పై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

కన్నీరు మున్నీరైన గ్రామం:

మృతదేహం గ్రామానికి చేరుకోగానే ఒక్కసారిగా అందరి ఆవేదన కట్టలు తెచ్చుకుంది. రవళి తల్లిదండ్రులు ఇతర కుటుంబసభ్యులతో పాటు గ్రామస్థులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం జరిగిన అంతిమయాత్రలో ఊరు ఊరంతా పాల్గొన్నారు. బెయిల్‌ పైన సాయి అన్వేష్ బయటకు వస్తే... ఉద్యమిస్తామని మహిళా సంఘాల నేతలు హెచ్చరించారు.

పోలీసుల బందోబస్తు:
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా గ్రామంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆరు రోజులుగా ఆసుపత్రిలో ఉండి... ఆఖరి క్షణం వరకూ మృత్యువుతో పోరాడినా.....ఫలితం లేకపోయింది. 20 ఏళ్లు కూడా నిండకుండానే నూరేళ్ల జీవితం కాలిపోయింది. ప్రేమోన్మాది కిరాతకానికి సజీవ సాక్ష్యంగా నిలిచి.... ఇక సెలవంటూ శాశ్వతంగా వెళ్లిపోయింది. ఇకముందైనా ఇలాంటి దాడులు జరగకూడదని.... ఉన్మాదుల దాడికి ఏ ఆడబిడ్డా బలి కాకూడదని కోరుకుందాం.

ఇవీ చూడండి: పెళ్లి చేయండి ప్లీజ్

ABOUT THE AUTHOR

...view details