తెలంగాణ వ్యాప్తంగా 9వ రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట డిపో ముందు ఆర్టీసీ కార్మికులు ఆందోళన నిర్వహించారు. ఖమ్మంలో ఆర్టీసీ కార్మికుడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసి హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతిచెందాడు. అతని మృతికి నిరసనగా ఆర్టీసీ కార్మికులు మౌనం పాటించారు. శ్రీనివాసరెడ్డి చిత్రపటంతో వరంగల్ కూడలి వరకు పలుపార్టీల మద్దతుతో ర్యాలీగా వెళ్లి రాస్తారోకో నిర్వహించారు.
శ్రీనివాసరెడ్డి మృతికి నిరసనగా ర్యాలీ
వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేటలో తొమ్మిదవ రోజూ ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. శ్రీనివాసరెడ్డి మృతికి నిరసనగా ర్యాలీలతో సమ్మెను ఉద్ధృతం చేస్తున్నారు.
ఈ రోజు మృతి చెందిన ఆర్టీసీ కార్మికుడు శ్రీనివాస్‌రెడ్డి మృతికి ముఖ్యమంత్రి కేసీఆర్ కారణమని ఆయనపై హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఉద్యమం ఎలా చేయాలో కేసీఆర్ తమకు నేర్పాడని, ఉద్యమ సెగను ముఖ్యమంత్రికి తగిలేలా చేస్తామని అన్నారు. ఏ ఒక్క కార్మికుడు అధైర్యపడి బలిదానాలు చేసుకోవద్దని వారు కార్మికులకు పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమానికి సీపీఎం, సీపీఐ, సీపీఐఎంల్, ప్రజాప్రంట్, ఎంఆర్పీఎస్, మాలమహానాడు, విద్యార్థి సంఘాల నాయకులు మద్దతుగా నిలిచారు.
ఇదీ చూడండి : "శ్రీనివాసరెడ్డిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే..."