తెలంగాణ

telangana

ETV Bharat / state

జాలర్లకు చిక్కిన కొండచిలువ - చేపలకు బదులులో వలలో కొండచిలువ

చేపల కోసం వేసిన వలలో కొండచిలువ పడిన ఘటన వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేటలో చోటుచేసుకుంది. నల్లబెల్లి చెరువు కింద ప్రవహిస్తున్న వాగులో చేపల వేటకు వెళ్లిన వారికి కొండచిలువ చిక్కింది.

జాలర్లకు చిక్కిన కొండచిలువ
జాలర్లకు చిక్కిన కొండచిలువ

By

Published : Sep 28, 2020, 11:17 AM IST

వరంగల్ గ్రామీణజిల్లా వర్ధన్నపేటలో ఆరడుగుల కొండచిలువ జాలర్లు వేసిన వలకు చిక్కింది. నల్లబెల్లి చెరువు మత్తడి కింద ప్రవహిస్తున్న వాగులో చేపల వేటకు వెళ్లిన వారికి వలలో చేపలకు బదులుగా కొండచిలువ పడగా అవాక్కయ్యారు.

వలను ఒడ్డుకు లాగి ఆరడుగుల కొండచిలువను వెలికి తీసి అటవీ అధికారులకు సమాచారం అందించారు.

ఇదీ చూడండి: కరోనా కోరల్ని లెక్కచేయని తల్లి.. బిడ్డకు పునర్జన్మనిచ్చింది...

ABOUT THE AUTHOR

...view details