తెలంగాణ

telangana

ETV Bharat / state

వీరి వీరి గుమ్మడి.. కొనేవారేరీ! - గుమ్మడి రైతులపై కరోనా ప్రభావం

లాక్​డౌన్​ వల్ల గుమ్మడికాయలు పండించే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పంట విరగ్గాసినా.. దేవాలయాలు మూసివేయడం, శుభకార్యాలు ఆగిపోవడం వల్ల కాయలను కొనేవారు లేకుండా పోయారు.

pumpkin farmers problems in selling their crop
వీరి వీరి గుమ్మడి.. కొనేవారేరీ!

By

Published : Apr 30, 2020, 9:13 AM IST

వరంగల్‌ గ్రామీణ జిల్లా గీసుకొండ మండలం దస్రు తండాకు చెందిన నూనావత్‌ మాన్‌సింగ్‌ అనే రైతు తన మూడెకరాల్లో గుమ్మడి సాగు చేశాడు. పంట విరగ్గాసింది. ఇంతలో లాక్‌డౌన్‌ ప్రకటించడంతో దేవాలయాలు మూతపడ్డాయి. శుభకార్యాలు ఆగిపోయాయి. గుమ్మడి కాయలను కొనేవారు లేకుండా పోయారు. ఏటా తాను నేరుగా హైదరాబాద్‌కు తరలించేవాడినని, ఈసారి రవాణాకు అవకాశం లేక ఇలా 20 టన్నుల పంటను రోడ్డు పక్కనే వదిలేశానని రైతు వాపోయారు.

ABOUT THE AUTHOR

...view details