వరంగల్ గ్రామీణ జిల్లా దుగ్గొండి తహసీల్ధార్పై అవినీతి ఆరోపణలు వచ్చినందున... జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జేసీ, ఆర్డీవోలు బహిరంగ విచారణ చేపట్టారు. రైతుల నుంచి వచ్చిన వినతులను స్వీకరిస్తూ పరిష్కార మార్గాలు సూచించారు. తమ భూములకు సంబంధించిన పట్టాలను ఇవ్వడం కోసం తహసీల్ధార్ కార్యాలయం చుట్టు తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. విచారణకు సంబంధించిన రిపోర్టును కలెక్టర్ గారికి అందిస్తామని జేసి తిరుపతిరెడ్డి తెలిపారు.
తహసీల్ధార్పై బహిరంగ విచారణ
వరంగల్ గ్రామీణ జిల్లా దుగ్గొండి తహసీల్దార్‌పై జేసీ, ఆర్డీవోలు బహిరంగ విచారణ చేపట్టారు. అతనిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారించారు.
తహసీల్ధార్పై బహిరంగ విచారణ