వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట సహకార సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు జరిపిన లాఠీ చార్జీకి నిరసనగా నెహ్రూ సెంటర్‌లో రాస్తారోకో చేశారు. ఈ నిరసనతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. పోలీసులు కార్యకర్తలను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
పోలీసుల లాఠీ ఛార్జ్‌కు నిరసనగా రాస్తారోకో.. - narsampeta today news
నిన్నటి నర్సంపేట సహకార సంఘం ఎన్నకల్లో జరిగిన లాఠీ ఛార్జ్‌పై కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేశారు. దానిని నిరిసిస్తూ రాస్తారోకో చేపట్టారు.
సోమవారం జరిగిన ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల్లో తెరాస సభ్యులను అడ్డుకునేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నం చేయడం వల్ల పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. అయితే ఆదివారం నర్సంపేట సహకార సంఘానికి ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులకు ఎన్నిక జరగాల్సి ఉండగా పదమూడు మందిలో ఆరుగురు తెరాస, ఎడుగురు కాంగ్రేస్ సభ్యులు గెలుపొందారు. హస్తం పార్టీ మద్దతు తెలిపిన టీసీ సభ్యుడు మొరాల మోహన్ రెడ్డి గులాబీ తీర్థం పుచ్చుకోవడం వల్ల స్వల్ప ఘర్షణ జరిగింది. ఈ సంఘటనతో ఎన్నికల అధికారులు ఛైర్మెన్, వైస్ ఛైర్మెన్ పదవులకు సోమవారానికి వాయిదావేశారు.
ఇవీ చూడండి:నేటి నర్సంపేట పీఏసీఎస్ ఎన్నికల్లో పోలీసుల లాఠీఛార్జ్