తెలంగాణ

telangana

ETV Bharat / state

గర్భవతిని చేసి.. పెళ్లి చేసుకోను అంటున్నాడు - fail

ప్రేమించానన్నాడు... పెళ్లి చేసుకుంటానన్నాడు... నమ్మించి గర్భవతిని చేశాడు. ఇప్పుడు మొహం చాటేస్తున్నాడు. తనకు న్యాయం చేయాలంటూ యువతి మాత్రం ప్రియుడి ఇంటి ముందు బైఠాయించి ఆందోళన చేపట్టింది.

ప్రియుడి ఇంటి ముందు బైఠాయింపు

By

Published : May 14, 2019, 9:07 PM IST

వరంగల్​ గ్రామీణ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం గ్రామానికి చెందిన సద్దాం, అప్సర ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడు. ఇప్పుడు వివాహానికి నిరాకరిస్తున్నాడంటూ ప్రియుడి ఇంటి ముందు యువతి ధర్నాకు దిగింది. తనకు న్యాయం చేయాలని కోరుతుంది. ఎమ్మార్పీఎస్ నాయకులు, గ్రామ సర్పంచి యశోద ఆమెకు మద్దతుగా నిలిచారు. ఇంతా జరుగుతున్న యువకుడు మాత్రం ఆమెతో తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంటున్నాడు.

ప్రియుడి ఇంటి ముందు బైఠాయింపు

ABOUT THE AUTHOR

...view details