తెలంగాణ

telangana

By

Published : Oct 10, 2020, 5:57 PM IST

ETV Bharat / state

ఎడతెరిపిలేని వర్షం.. విద్యుత్​కు అంతరాయం

మూడు గంటలపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి వరంగల్ గ్రామీణ జిల్లా కేంద్రంలో రహదారులన్నీ జలమయమయ్యాయి. వర్ధన్నపేట మండల కేంద్రంలో ఆకేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

Power outage in warangal rural district
వర్ధన్నపేటలో ఎడతెరిపిలేని వర్షం

వరంగల్ గ్రామీణ జిల్లాలో భారీ వర్షం కురిసింది. మూడు గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి రహదారులన్నీ జలమయమయ్యాయి. వర్ధన్నపేట మండలకేంద్రంలో ఆకేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

రాయపర్తి, సంగెం, పర్వతగిరి మండలాల్లో కురిసిన వర్షానికి పలుచోట్ల చెరువులు మత్తడి పోశాయి. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురవడం వల్ల వర్ధన్నపేట మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

ABOUT THE AUTHOR

...view details