స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా వరంగల్ గ్రామీణ జిల్లాలో పోలీసులు వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. జిల్లాలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా వర్ధన్నపేట సర్కిల్ పరిధిలో ఈ సోదాలు చేపట్టినట్లు ఏసీపీ రమేష్ వెల్లడించారు.
పంద్రాగస్టు నేపథ్యంలో ముమ్మర వాహన తనిఖీలు - వరంగల్ రూరల్ జిల్లా తాజా వార్త
పంద్రాగస్టు వేడుకల నేపథ్యంలో వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేటలో పోలీసులు వాహన సోదాలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఉండేందుకే ఈ సోదాలని పేర్కొన్నారు.
![పంద్రాగస్టు నేపథ్యంలో ముమ్మర వాహన తనిఖీలు police vehicle checking for the occasion of Independence day at warangal rural district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8412029-751-8412029-1597366665245.jpg)
పంద్రాగస్టు నేపథ్యంలో ముమ్మర వాహన తనిఖీలు
పలువురు వాహనదారుల వివరాలు సేకరించాకే ప్రయాణానికి అనుమతించినట్లు ఆయన తెలిపారు. అనుమానాస్పదంగా ఎవరైనా వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. వాహన తనిఖీల్లో సీఐ విశ్వేశ్వర్, ఎస్సై వంశీకృష్ణా సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చూడండి: తమిళనాడులో మరో 5,835 మందికి కరోనా