తెలంగాణ

telangana

ETV Bharat / state

వరంగల్ గ్రామీణంలో పోలీసుల ముమ్మర తనిఖీలు - wardhannapet news

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముమ్మర సోదాలు నిర్వహిస్తున్నారు. మావోల కదలికలను కట్టడి చేసేందుకు గానూ... ముందస్తు తనిఖీలు చేస్తున్నారు. అనుమానాస్పదంగా ఎవరు కనిపించినా... సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.

police searches in warangal commissionarate
వరంగల్ గ్రామీణంలో పోలీసుల ముమ్మర తనిఖీలు

By

Published : Jul 24, 2020, 11:01 PM IST

మావోయిస్టు పార్టీ రేపు తెలంగాణ బంద్​కు పిలుపునివ్వటం వల్ల అప్రమత్తమైన పోలీసులు... వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముమ్మర సోదాలు నిర్వహిస్తున్నారు. మావోల కదలికలను కట్టడి చేసేందుకు గానూ... ముందస్తు తనిఖీలు చేస్తున్నారు.

వర్ధన్నపేట, రాయపర్తి, సంగెం, పర్వతగిరి మండలాల్లో వాహనాలను క్షుణ్ణంగా సోదాలు నిర్వహించాకే ప్రయాణానికి అనుమతిస్తున్నారు. మావోలను పూర్తి స్థాయిలో కట్టడి చేసే క్రమంలో ప్రజలు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. అనుమానాస్పదంగా ఎవరు కనిపించినా... సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.

ఇదీ చదవండి:ఎండమావిగా మారిన 'సత్వర'న్యాయం

ABOUT THE AUTHOR

...view details