వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట సహకార సంఘం ఛైర్మన్ ఎన్నిక లాఠీఛార్జ్కి దారి తీసింది. ఇవాళ మూడు గంటలకు ఓటు వేయడానికి తెరాస పార్టీ బలపరిచిన అభ్యర్థులు వాహనంలో వస్తుండగా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న పోలీసులు పరిస్థితిని చక్కదిద్దేందుకు కాంగ్రెస్ కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేసి చెదరగొట్టారు.
నేటి నర్సంపేట పీఏసీఎస్ ఎన్నికల్లో పోలీసుల లాఠీఛార్జ్ - warangal rural district news
వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట సహకార సంఘం ఛైర్మన్ ఎన్నిక నేటికి వాయిదా పడగా.. ఇవాళ సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఎన్నిక నిర్వహించారు. ఈ క్రమంలో ఓటు వేయడానికి తెరాస మద్ధతుదారులు వస్తుండగా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.
నేటి నర్సంపేట పీఏసీఎస్ ఎన్నికల్లో పోలీసుల లాఠీఛార్జ్
అనంతరం ఇరుపార్టీల టీసీ సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆదివారం ఛైర్మన్ ఎన్నిక జరగాల్సి ఉండగా స్వల్ప గొడవతో ఎన్నికల అధికారులు నేటికి వాయిదా పడింది. అధికారులు ఇవాళ సీక్రెట్ బ్యాలెట్ ద్వారా పూర్తి చేశారు.
ఇవీ చూడండి:లవ్ ఫెయిల్ అంటూ బైక్పై అతివేగం.. గాల్లో ప్రాణాలు