వరంగల్ గ్రామీణ జిల్లాలో కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో పోలీస్ స్టేషన్లలో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. కొవిడ్ నివారణ చర్యల్లో భాగంగా వర్ధన్నపేట పోలీసులు స్టేషన్కు వచ్చే దరఖాస్తులను స్టెరిలైట్ చేస్తున్నారు. ఇస్త్రీ పెట్టె సాయంతో దరఖాస్తు పేపర్లను రుద్దిన తర్వాతనే వాటిని పరిశీలిస్తున్నారు. వర్ధన్నపేట, రాయపర్తి, జఫర్గడ్ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు స్టెరిలైజేషన్ చేసిన తర్వాతే స్వీకరించేలా చర్యలు తీసుకుంటున్నారు.
పీఎస్కు వచ్చే ఫిర్యాదు పేపర్లను ఇస్త్రీ చేస్తున్న పోలీసులు
వరంగల్ గ్రామీణ జిల్లాలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసులు పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదు పేపర్లను ఇస్త్రీ చేస్తున్నారు. ఆ తర్వాతే వాటిని చేతుల్లోకి తీసుకొని పరిశీలిస్తున్నారు.
పీఎస్కు వచ్చే ఫిర్యాదు పేపర్లను ఇస్త్రీ చేస్తున్న పోలీసులు
ఇప్పటికే వర్ధన్నపేట పోలీస్ స్టేషన్లో ఏడుగురు సిబ్బందికి కరోనా సోకింది. అందువల్లే ముందుస్తు చర్యల్లో భాగంగా ఇలా ఇస్త్రీ కంప్లైంట్స్ సేకరణకు శ్రీకారం చుట్టారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ పోలీస్ స్టేషన్ వద్దకు రావద్దని తెలిపారు. సమూహాలుగా కాకుండా ఒక్కరు మాత్రమే ఫిర్యాదు చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇవీ చూడండి:గుండె, ఊపిరితిత్తులపై కరోనా దాడి.. రక్తనాళాలపై దుష్ప్రభావం