తెలంగాణ

telangana

ETV Bharat / state

మిస్టరీ కేసైనా.. హిస్టరీతో సహా బయటపెట్టేశారు - gorrekunta well murder case latest news

నిద్రమాత్రలిచ్చి.. 9 మందిని బావిలోకి తోసి హతమార్చిన.. గొర్రెకుంట బావి కేసును పోలీసులు సవాల్​గా తీసుకున్నారు. 72 గంటల వ్యవధిలోనే.. అన్ని ఆధారాలు సేకరించి నిందితుడిని పట్టుకొని తామేంటో నిరూపించారు పోలీసులు. మొత్తం 6 బృందాలుగా ఏర్పడి 100 మంది సిబ్బంది రాత్రింబవళ్లు పనిచేశారు. వారి కృషికి ఫోన్ డేటా.. సీసీ ఫుటేజీలు బాగా సహకరించాయి.

మిస్టరీ కేసైనా.. హిస్టరీతో సహా బయటపెట్టేశారు
మిస్టరీ కేసైనా.. హిస్టరీతో సహా బయటపెట్టేశారు

By

Published : May 26, 2020, 12:10 AM IST

వరంగల్​ గ్రామీణ జిల్లా గొర్రెకుంట బావి హత్యల ఘటన రాష్ట్రంలో సంచలనమైంది. నిందితుడు సంజయ్​ కుమార్​ను సోమవారం గీసుకొండ మండలం జాన్​పాక్​లోని తన నివాసంలో పోలీసులు అరెస్టు చేశారు. బిహార్​ రాష్ట్రం బిగుసరై జిల్లా నుర్లపూర్​కు చెందిన ఇతని వయసు మాత్రం 24 ఏళ్లే. వయసు చిన్నదే కానీ.. అన్నీ చావు తెలివితేటలే. మానవత్వం మరచిపోయి పదిమందిని నిర్ధాక్షిణ్యంగా చంపాడు. అయితే ఈ రాక్షసుడిని పోలీసులు 72 గంటల్లో పట్టుకొని వాళ్లేంటో నిరూపించారు.

6 బృందాలు.. 72 గంటలు..

9 మంది మృతదేహాలు బావిలో లభ్యమైన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. గురువారం మధ్యాహ్నం నుంచి ఆదివారం రాత్రి వరకు ముమ్మర విచారణ చేపట్టారు. మొత్తంగా 6 ప్రత్యేక బృందాలతో 72 గంటలపాటు రాత్రింబవళ్లు శ్రమించి.. కేసును ఛేదించారు. ఈ కేసు దర్యాప్తు కోసం 100 మంది సిబ్బంది పనిచేశారు. టాస్క్​ఫోర్స్​, సీసీఎస్​, ప్రత్యేక బృందం, క్లూస్​ టీం, సాంకేతిక బృందం, స్థానిక పోలీసులు అందరూ సమన్వయంతో పనిచేశారు.

పట్టించిన సీసీ టీవీ ఫుటేజీ, కాల్​ డేటా

మక్సూద్​ కుటుంబంతో ఉన్న పరిచయస్తులను పోలీసులు ప్రశ్నించారు. గోదాం వద్ద, మృతుల నివాసం వద్ద ఉండే వారిని గమనించారు. అనుమానితుల వివరాలు సేకరించారు. సెల్​ఫోన్​ కాల్​ డేటా ఈ విచారణలో బాగా ఉపయోగపడింది. అన్నింటికి మించి సీసీ ఫుటేజీ దృశ్యాలు నిందితున్ని పట్టించాయి. మక్సూద్​, బిహారీలు ఉండే గదిలో దొరికిన వస్తువులపై పోలీసులు వేలిముద్రలు తీసుకొన్నారు. నిందితుడి వేలిముద్రలతో సరిపోయాయాన్నదీ పరిశీలించారు. ఘటన జరిగిన సమయంలో ప్రత్యక్ష సాక్ష్యాలు ఇచ్చిన సమాచారం పోలీసులకు ఎంతో ఉపయోగపడింది.

విస్తృత విచారణ

ఏ చిన్న అంశాన్ని కూడా వదలకుండా ముమ్మర శోధన చేయడం వల్ల ఫలితం కనిపించింది. నిందితుడు సంజయ్ కుమార్ యాదవ్... పోలీసుల నుంచి తప్పించుకోలేకపోయాడు. ఈ కేసులో వైద్య ఆధారాలు కూడా కీలకంగా మారాయి. నీటిలో పడి చనిపోయారని.. శరీరాలపై ఈడ్చుకుపోయిన గాయాలున్నాయని.. పోస్టుమార్టం చేశాక ఫోరెన్సిక్‌ నిపుణులు ప్రాథమికంగా తేల్చారు. ఈ విషయం కూడా పోలీసుల దర్యాప్తునకు బాగా ఉపయోగపడింది. పోలీసు సిబ్బంది అంతా.. సవాల్​గా తీసుకొని దర్యాప్తు చేయడం వల్ల మూడే రోజుల్లో కేసును ఛేదించారు.

ఇదీ చూడండి:భారత్​, చైనా సరిహద్దు వివాదం- 10 కీలకాంశాలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details