తెలంగాణ

telangana

ETV Bharat / state

తాగునీటి సరఫరాలో నిర్లక్ష్యం వద్దు: ఎమ్మెల్యే రమేశ్‌ - Plenary Session held at the Parvathagiri Mandal Parishad

ప్రతి ఇంటికీ తాగునీరందేలా సర్పంచులు, అధికారులు చర్యలు తీసుకోవాలని, లేకపోతే వేటు తప్పదని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ అన్నారు. పర్వతగిరి మండల పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు.

Plenary Session held at the Parvathagiri Mandal Parishad Office warangal rural district
తాగునీటి సరఫరాలో నిర్లక్ష్యం వద్దు: ఎమ్మెల్యే రమేశ్

By

Published : Sep 6, 2020, 12:55 PM IST

ప్రజా సమస్యలు తీర్చేలా అధికారులు కృషిచేయాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ అన్నారు. ప్రతి ఇంటికీ తాగునీరందేలా సర్పంచులు, అధికారులు చర్యలు తీసుకోవాలని, లేకపోతే వేటు తప్పదని హెచ్చరించారు. వరంగల్​ రూరల్​ జిల్లా పర్వతగిరి మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ కమల అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

శ్మశానవాటికలు, డంపింగ్‌ యార్డులు, విద్యుత్‌ సరఫరాకు ప్రణాళికలు సిద్ధం చేయాలని విద్యుత్‌శాఖ అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. మొదటి దశలో పూర్తి కాని పైపులైన్‌, నల్లాల బిగింపు తదితర పనుల కోసం మండలంలో రెండో దశలో 33 కి.మి పనులకు నిధులు మంజూరైనట్లు తెలిపారు. జడ్పీటీసీ సభ్యుడు సింగులాల్‌, వైస్‌ ఎంపీపీ రాజేశ్వర్‌రావు, జడ్పీ కో-ఆప్షన్‌ సభ్యుడు సర్వర్‌, కల్లెడ, చౌటపల్లి సొసైటీల ఛైర్మన్లు, అధికారులు పాల్గొన్నారు.

పూర్తి నివేదిక రూపొందించాలి...

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జరిగిన పంట నష్టంపై పూర్తి నివేదిక రూపొందించాలని, వెంటనే రైతులకు నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. గ్రామాల సమగ్రాభివృద్దే ద్యేయంగా ప్రజా ప్రతినిదులు, అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.

ఇదీ చూడండి: 'బుల్లెట్‌' ఎప్పుడనేది ఇప్పుడే చెప్పలేం!

ABOUT THE AUTHOR

...view details