తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఐసోలేషన్ కేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి' - వర్ధన్నపేటలో ఐసోలేషన్ కేంద్రం

కరోనా సోకిన ప్రజలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాన్ని వినియోగించుకోవాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాన్ని ఆయన సందర్శించారు.

trs
trs

By

Published : May 24, 2021, 7:41 PM IST


వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలో కరోనా బాధితుల కోసం ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాన్నిస్థానిక ఎమ్మెల్యే అరూరి రమేశ్ సందర్శించారు. కొవిడ్ కేర్ సెంటర్​లో ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఐసోలేషన్​లో ఉండే కరోనా బాధితులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. కరోనా సోకిన ప్రజలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details