తెలంగాణ

telangana

By

Published : Oct 17, 2020, 11:50 AM IST

ETV Bharat / state

బతుకమ్మపై కరోనా ప్రభావం.. ఆడేందుకు భయపడుతున్న మహిళలు

కరోనా భయంతో గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు సామూహికంగా బతుకమ్మ ఆడేందుకు జంకుతున్నారు. వరంగల్​ గ్రామీణ జిల్లాలో రెండవ రోజు బతుకమ్మ సంబరాలకు మహిళలు ఎక్కువగా రాలేదు. బతుకమ్మ సంబురాలకు కరోనా అడ్డు పడుతుందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

People Afraid to Participate in bathukamma celebrations due to Corona
బతుకమ్మ సంబరాలకు కరోనా భయం.. ఆడేందుకు భయపడుతున్న మహిళలు

వరంగల్​ గ్రామీణ జిల్లాలో బతుకమ్మ సంబురాల్లో పాల్గొనడానికి మహిళలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కరోనా భయంతో దూరదూరంగా ఉంటూ.. సామూహిక సంబురాల్లో పాల్గొనడానికి భయపడ్డారు. చాలాచోట్ల తక్కువ సంఖ్యలో మహిళలు బతుకమ్మ ఆడారు.

జిల్లాలోని వర్ధన్నపేట, రాయపర్తి, సంగెం, పర్వతగిరి మండలాల్లో బతుకమ్మ వేడుకల్లో మహిళలు మాస్కులు ధరించి బతుకమ్మ ఆడుకున్నారు. మహిళలు ఎంతో భక్తి శ్రద్దలతో నిర్వహించుకునే పూలపండగ ఇలా కరోనా, అధిక మాసం వల్ల కళ తప్పిందని గ్రామీణ ప్రజలు వాపోయారు. ఎన్నడూ లేని విధంగా బతుకమ్మ సంబరాలు ఇలా చేసుకోవాల్సి రావడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపడుచుల హడావిడి, చిన్నారుల సందడి.. ఏమి లేకుండానే బతుకమ్మ పండగ నిర్వహించుకోవడం బాగలేదంటున్నారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని.. బతుకమ్మను వేడుకున్న మహిళలు వచ్చే ఏడాది బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details