వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి పోలీసులు లాక్డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలుంటాయని ప్రజల్ని హెచ్చరిస్తున్నారు.
మాస్కు మరిచారు.. జరిమానా కట్టారు - strict lock down rules in warangal rural district
మాస్కులు ధరించాలంటూ అధికారులు నెత్తి...నోరు కొట్టుకుంటున్నా ప్రజలు వినడం లేదు...ఎంత చెప్పినా లాభం లేకపోవడం వల్ల వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి పోలీసులు మాస్కులు ధరించని వారికి జరిమానా విధిస్తున్నారు.
మాస్కు మరిచారు.. జరిమానా కట్టారు
రాయపర్తిలో మాస్కు ధరించకుండా బయటకు వచ్చిన ఏడుగురు యువకులకు పోలీసులు రూ.1000 చొప్పున జరిమానా విధించారు. మరోసారి మాస్కు లేకుండా బయటకొస్తే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.