తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రశాంతంగా పోలింగ్... ఓటు వేసిన ప్రజాప్రతినిధులు - ప్రశాంతంగా పోలింగ్

గ్రేటర్ వరంగల్​లో తెరాస జెండా ఎగురవేస్తామని ఎమ్మెల్యే నరేందర్ ధీమా వ్యక్తం చేశారు. రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్​తో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇస్లామియా కాలేజ్ వద్ద పోలింగ్ ప్రక్రియను సీపీ తరుణ్ జోషి పరిశీలించారు.

peaceful polling in greater warangal elections
ప్రశాంతంగా పోలింగ్... ఓటు వేసిన ప్రజాప్రతినిధులు

By

Published : Apr 30, 2021, 1:37 PM IST

గ్రేటర్ వరంగల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు స్వచ్ఛందంగా పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. పెరకవాడలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్​, రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఓటు వేసిన ప్రజాప్రతినిధులు

మట్టెవాడ పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య.. కుటుంబ సమేతంగా ఓటు వేశారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 24 డివిజన్​లలో తెరాస జెండా ఎగురవేస్తామని ఎమ్మెల్యే నరేందర్ ధీమా వ్యక్తం చేశారు. ఇస్లామియా కాలేజ్ వద్ద పోలింగ్ ప్రక్రియను పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, డీసీపీ పుష్ప పరిశీలించారు.

ఇదీ చూడండి:3 మున్సిపాలిటీల్లో 9 వరకు సగటున 10 శాతం పోలింగ్

ABOUT THE AUTHOR

...view details