కన్నతల్లిని అతి కిరాతంగా హతమార్చిన కూతురి ఘటన మరవకముందే... పేగు పంచుకొని పుట్టిన కన్న కొడుకుని తల్లిదండ్రులు చంపిన ఉదంతం వరంగల్ రూరల్ జిల్లా ముత్యాలపల్లిలో చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో భార్య గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి మహేష్ తల్లిదండ్రుల వద్దనే ఉంటున్నాడు. ఈ క్రమంలో మహేష్ మద్యానికి బానిసయ్యాడు.
తాగొచ్చి గొడవచేస్తున్నాడని కన్నవాళ్లే కడతేర్చారు - parents killed son
వరంగల్ రూరల్ జిల్లా ముత్యాలపల్లిలో విషాద ఘటన జరిగింది. రోజూ తాగొచ్చి ఇంట్లో గొడవచేస్తున్నాడని విసిగిపోయిన తల్లిదండ్రులు కన్న కొడుకుని... కిరోసిన్ పోసి కాల్చి చంపేశారు.
కుటుంబ కలహాలతో కన్నవాళ్లే కడతేర్చారు
రోజూ తాగొచ్చి తల్లిదండ్రులను చితకబాదుతున్నాడు. విసిగిపోయిన తల్లిదండ్రులు రెండు చేతులు కట్టేసి కిరోసిన్ పోసి సజీవ దహనం చేశారు. మహేష్ అక్కడికక్కడే కాలి బూడిదయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చూడండి: 3 రోజుల కస్టడీకి కీర్తిరెడ్డి
Last Updated : Nov 12, 2019, 11:03 PM IST