తెలంగాణ

telangana

ETV Bharat / state

'శ్రమజీవులకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం' - Parala MLA Challa Dharmareddy latest news

ఉపాధిహామీ పథకాన్ని మొట్టమొదటి సారి నీటిపారుదల శాఖకు అనుసంధానం చేసిన ఘనత సీఎం కేసీఆర్​దేనని పరకాల​ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా హరితహారంలో భాగంగా పట్టణంలో మొక్కలు నాటారు.

Parala MLA Challa Dharmareddy planted the town as part of a Harithaharam Programme
'శ్రమజీవులకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం'

By

Published : Jun 22, 2020, 6:31 PM IST

వరంగల్ రూరల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గ్రామీణ ఉపాధిహామీ పథకంలో జరుగుతున్న పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. ఉపాధిహామీ పథకాన్ని మొట్టమొదటి సారి నీటిపారుదల శాఖకు అనుసంధానం చేసిన ఘనత సీఎం కేసీఆర్​దేనని​ పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో రూ.1,230 కోట్ల పనులు పునరుద్ధరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు.

ఈ పనులను మరింత విస్తృతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయి నగరాలు విడిచి పల్లెబాట పట్టిన శ్రమజీవులకు ఈ పథకం అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో నీటిపారుదల శాఖ అధికారులు, పంచాయతీ రాజ్​ శాఖ అధికారులు పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details