పల్లె ప్రగతి కార్యక్రమంతో వరంగల్ రూరల్ జిల్లా పరకాల నియోజకవర్గంలోని గ్రామాల రూపురేఖలు మారాయని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. 70 ఏళ్లు పరిపాలించిన గత ప్రభుత్వాలు చేయని అభివృద్ధి పనులను సీఎం చేశారని పేర్కొన్నారు. గీసుగొండ మండలం గంగదేవిపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో మండలంలోని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులతో ఎమ్మెల్యే సమావేశం అయ్యారు.
పల్లె ప్రగతితో పరకాల నియోజకవర్గానికి కొత్త రూపు: ఎమ్మెల్యే - warangal rural district latest news
పల్లె ప్రగతి కార్యక్రమంతో వరంగల్ రూరల్ జిల్లా పరకాల నియోజకవర్గంలోని గ్రామాల రూపురేఖలు మారాయని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గీసుకొండ మండలంలోని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులతో ఆయన సమావేశం అయ్యారు. ఈ మేరకు గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్షించారు.
![పల్లె ప్రగతితో పరకాల నియోజకవర్గానికి కొత్త రూపు: ఎమ్మెల్యే parakala mla in rural development review meeting with surpunch and panchayat secretaries](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9092805-384-9092805-1602124619525.jpg)
అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలి: ఎమ్మెల్యే చల్లా
అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ ప్రభుత్వం నిర్దేశించిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. అభివృద్ధి పనులు, సమస్యలపై గ్రామాల వారీగా సమీక్షించారు.
ఇదీ చదవండి:సచివాలయ నిర్మాణ వ్యవధి పెంచండి: గుత్తేదార్లు